ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్‌ను మంత్రి నారా లోకేశ్ స్వీకరించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విద్యాశాఖ ఆధ్వర్యంలో కోటి మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొంది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో కోటి మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే ఆ కోటి మొక్కలు నాటి చూపిస్తామని నారా లోకేష్ ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని లోకేశ్ తెలిపారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, యోగా వంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు.