టీడీపీ కార్యకర్తలు తమ కుటుంబంపై దాడి చేశారని, తన భార్యను కాలితో తన్నారని వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఆరోపించారు. తమ కుటుంబంపై దాడి చేసిన వీడియోను త్వరలోనే విడుదల చేస్తానని సురేశ్ తెలిపారు. ఇదేనా చంద్రబాబుకు దళితులపై ఉన్న ప్రేమ అని సురేష్ ప్రశ్నించారు. దళితులపై ఆయనకు ఉన్నది కపట ప్రేమ అని, చంద్రబాబు చేసే పర్యటనలు సినిమా షూటింగుల్లా ఉన్నాయని విమర్శించారు. దళితులపై బహిరంగంగానే విమర్శలు చేసిన చంద్రబాబు, లోకేశ్, పవన్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. పథకాలపై ప్రశ్నిస్తే దళితులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.