ఖబడ్దార్‌.. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం: బాలకృష్ణ హెచ్చరిక

Nandamuri balakrishna serious warning to ysrcp leaders. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు.

By అంజి  Published on  20 Nov 2021 1:36 PM IST
ఖబడ్దార్‌.. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం: బాలకృష్ణ హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన కామెంట్లపై నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో తప్పుదోవ పట్టేలా వ్యవహారించడం చాలా బాధకరమని అన్నారు. ఏపీ అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదికైందని, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ చేపట్టాల్సింది పోయి.. వ్యక్తిగత అజెండాను తీసుకొచ్చారని బాలకృష్ణ అన్నారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదన్నారు. అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితేనన్న ఆయన.. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేదన్నారు.

అభివృద్ధిపై చర్చకు బదులు వ్యక్తిగత అజెండా తీసుకొచ్చారు. వైసీపీ నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ఉన్నామో... పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదని, అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు... హేళన చేయవద్దని సూచించారు. ఏకపక్షంగా సభను నడుపుతున్నారని బాలకృష్ణ ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారు బాలకృష్ణ పేర్కొన్నారు. ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకుని కూర్చోమన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు.

మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం అంటూ బాలకృష్ణ ఫైర్‌ అయ్యారు. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని బాలకృష్ణ హెచ్చరించారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని.. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తు చేశారు. ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

Next Story