డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా

Nagari Mla Rk Roja Exhibits Her Desire As Doctor. నగరి ఎమ్మెల్యే రోజా.. యాక్టర్ గానే అందరికీ తెలుసు.. కానీ డాక్టర్ కాదు. అయినా

By Medi Samrat  Published on  19 Dec 2021 4:51 PM IST
డాక్టర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా.. యాక్టర్ గానే అందరికీ తెలుసు.. కానీ డాక్టర్ కాదు. అయినా ఆమె చిన్నతనంలో కుటుంబ సభ్యులు ఆమెను డాక్టర్ చేయడానికి ప్రయత్నించారట.. అందుకు తగ్గట్టుగా చదువు కూడా కొనసాగింది. అయితే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత బిజీ అయిపోవడం వంటివి జరిగాయి. దీంతో డాక్టర్ అవ్వకుండా యాక్టర్ మాత్రం అయిపోయింది. సినిమాల్లో డాక్టర్ గా పాత్రలు చేసిన రోజా.. నిజ జీవితంలో డాక్టర్ అవతారం ఎత్తారు. అలాగని ఆపరేషన్ లు చేయలేదనుకోండి. కేవలం సరదా కోసం ఈ రోజు స్టెతస్కోప్ పట్టుకున్నారు.

ఆర్కే రోజా మెడలో స్టెతస్కోప్ వేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒకరికి వైద్య పరీక్షలు నిర్వహించి బీపీ నార్మల్.. షుగర్ నార్మల్ అంటూ చెప్పారు. పుత్తూరు పరిధిలో ఎమ్మెల్యే రోజా ఆదివారం పర్యటించారు. మెడలో స్టెతస్కోప్ వేసుకుని డాక్టర్‌గా మారారు. డాక్టర్ కావాలనేది తన కోరిక అని, ముఖ్యంగా తన ఇంట్లో వాళ్ల కోరిక అని చెప్పారు. ఇంట్లో వారి కోసం డాక్టర్ అవుదామని అనుకున్నానని, పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా ఇంటర్ పాస్ అయ్యానని చెప్పారు. ఆ తర్వాత మెడికల్ సీటు కోసం ఎంట్రెన్స్ టెస్ట్ కూడా రాశానని రోజా చెప్పారు. అయితే తనకు సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని అలా సినిమాల్లోకి వెళ్లిపోయానని.. ఆ తర్వాత పాలిటిక్స్‌లోకి వచ్చానని అన్నారు. అలా వెళ్లిపోవడంతో డాక్టర్ కాలేకపోయానని చెప్పారు.


Next Story