ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన నాగ బాబు

మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయడంపై ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. కొందరేమో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం చేస్తూ ఉండగా..

By Medi Samrat  Published on  17 Feb 2024 3:03 PM GMT
ఎన్నికల్లో పోటీ చేయడంపై క్లారిటీ ఇచ్చిన నాగ బాబు

మెగా బ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయడంపై ఊహాగానాలు కొనసాగుతూ ఉన్నాయి. కొందరేమో ఆయన ఎంపీగా పోటీ చేయబోతున్నారనే ప్రచారం చేస్తూ ఉండగా..మరోవైపు పొత్తులో భాగంగా ఆయనకు సీటు ఇవ్వడం లేదనే వాదన కూడా వినిపిస్తున్నారు. ఇంతలో నాగబాబు పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారంటూ వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా పుకార్లు షికార్లు చేసే బదులు ఓ క్లారిటీ ఇచ్చేయాలని అనుకున్నారు నాగబాబు.

ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుంది అని వివరించారు. రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ వైఖరి బాగోలేదని మండిపడ్డారు. అనేక మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారన్నారు. అమరావతి రాజధాని ఉండాలన్నదే తన అభిప్రాయమని స్పష్టం చేశారు. శాసనసభా సాక్షిగా అందరూ కూడా అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారన్నారు. 'అనగనగా ఒక పేదవాడు. పదుల సంఖ్యలో ప్యాలెస్ లు, వేల కోట్ల బ్యాలెన్సు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్న పేదవాడు... నవ్వకండి. ఇట్స్ ఏ సీరియస్ మ్యాటర్' అని సీఎం జగన్ పై విమర్శలు చేశారు. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఉన్న మీరు 'పేదోడికి, పెత్తందార్లకి మధ్య యుద్ధం' అంటుంటే నవ్వాగట్లేదు సారూ అని ఎద్దేవా చేశారు. నాగబాబు అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఇల్లు తీసుకోవడంతో ఆయన ఎంపీగా పోటీ చేసేది అనకాపల్లి స్థానం నుంచే అని ప్రచారం జరుగుతోంది.

Next Story