బూతులతో కాదు.. దాడులు చేయించి చంపేయండి : ముద్రగడ

ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని వైసీపీ నేత‌, కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు

By Medi Samrat  Published on  21 Jun 2024 4:15 PM IST
బూతులతో కాదు.. దాడులు చేయించి చంపేయండి : ముద్రగడ

ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని వైసీపీ నేత‌, కాపు ఉద్య‌మ నాయ‌కుడు ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం కిర్లంపూడిలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాన‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ అడుగుజాడల్లో నడుస్తున్నాయని.. కాపులకు న్యాయం చేయండని డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కోరారు.

జనసేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు నామీద బూతులతో దాడులు చేస్తున్నారు.. ఇది మంచి పద్ధతి కాదన్నారు. పవన్ కళ్యాణ్‌.. జన సైనికులకు ఇది మంచి పద్ధతి కాదు అని ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. అలా కాదంటే మా కుటుంబాన్ని మీ జనసైనికులు చేత దాడులు చేయించి మమ్మల్ని చంపేయండని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీకి సూచనలు చేయాలని సూచించారు.

Next Story