ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన వంగా గీత
జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత బరిలో దిగుతున్నారు.
By Medi Samrat Published on 20 March 2024 2:00 PM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ఎంపీ వంగా గీత బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక వంగా గీత జనసేన పార్టీలోకి వస్తారని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే తామని అన్నారు. పిఠాపురంలో తన ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డిని రంగంలో దించారని, ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష ఇస్తున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఎంపీ వంగా గీత కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది 2009లో కాదని, డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. 2009లో మా అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం తరఫున నాకు అవకాశం ఇచ్చేటప్పటికే రాజ్యసభ సభ్యురాలినని చెప్పారు వంగా గీత. ఈ విషయం అల్లు అరవింద్ గారికి, అందరికీ తెలుసన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశాను, ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలినయ్యానని అన్నారు. 2006లో రాజ్యసభకు వెళ్లానని.. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరానని వివరించారు. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడాలని.. నేను సీనియర్ రాజకీయ నాయకులినే అయినప్పటికీ, మా పార్టీలోకి వచ్చేయండి అని ఆయనను ఆహ్వానించలేనన్నారు.పిఠాపురంలో కచ్చితంగా గెలుపు తనదేనని చెప్పుకొచ్చారు. పోలింగ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపున చక్కగా ప్రచారం చేసుకోవచ్చన్నారు. ఇప్పుడే డబ్బుల గొడవ ఎందుకు? ప్రజలేంటి, వాళ్ల పరిస్థితులేంటి, వాళ్ల ఇబ్బందులేంటో తెలుసుకోవాలని అన్నారు. నియోజకవర్గానికి చేయాల్సిందేమిటో కూడా తెలుసుకోవాలి. ఓట్లు కొనేస్తారంటూ మాట్లాడడం కరెక్ట్ కాదని వంగా గీత స్పష్టం చేశారు.