ఏపీలో అడుగుపెట్టిన రఘురామ
నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు.
By Medi Samrat
నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నేడు తిరుమలలో పర్యటించానని ఆయన ట్వీట్ చేశారు. "వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. అనంతరం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకున్నాను. సుమారు రెండు సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా, అందరికీ శుభం జరగాలని, రాష్ట్ర ప్రజల కోరికలు నెరవేరాలని స్వామివారిని కోరుకున్నాను... ఓం నమో వేంకటేశాయ" అని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, అనంతరం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నాను. సుమారు రెండు సంవత్సరాల తరువాత రాష్ట్రానికి రావడం.. స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ మంచి… pic.twitter.com/aqzWizHDpe
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) December 23, 2023
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణరాజు. వైసీపీ నాయకత్వంతో విభేదాలు నెలకొన్నాక.. సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా మా పార్టీ.. మా పార్టీ అంటూ వైసీపీకి వ్యతిరేకంగా ఎన్నో విమర్శలు చేశారు. ఆయన తాను రాష్ట్రానికి రాలేని పరిస్థితులు ఉన్నాయంటూ గతంలో కూడా ఆరోపణలు చేశారు. అందుకోసమే ఆయన తన నియోజకవర్గానికి దూరమయ్యారు.