చంద్రబాబుతో రఘురామ భేటీ

MP Raghurama Krishnaraju Meet With Chandrababu. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు

By Medi Samrat  Published on  5 Dec 2022 6:30 PM IST
చంద్రబాబుతో రఘురామ భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు భేటీ అయ్యారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. అక్కడ చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు చంద్రబాబు నాయుడును రఘురామ కృష్ణరాజు కలిశారు. పలు అంశాలను ఆయన చంద్రబాబుతో చర్చించినట్టుగా తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ తరపున గెలిచిన రఘురామ కృష్ణరాజు.. ఆ తర్వాత వైసీపీకి దూరమయ్యారు. ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ అధినేతతో భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.


Next Story