అమిత్ షాతో భేటీ అయిన‌ రఘురామకృష్ణ రాజు

MP Raghurama Krishna Raju Meet With Amit Shah. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు.

By Medi Samrat  Published on  20 July 2021 4:37 PM GMT
అమిత్ షాతో  భేటీ అయిన‌ రఘురామకృష్ణ రాజు

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కలిశారు. రఘురామ మంగళవారం ఢిల్లీలోని ఆయన ఛాంబర్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రఘురామ ఆరోగ్య పరిస్థితిని అమిత్‌ షా అడిగి తెలుసుకున్నారు. అంతకముందు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రఘురామ.. రాజధాని పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సీఎం జగన్‌, మంత్రి బొత్స క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదని సుప్రీం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. నిజమైన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విశాఖలో జరిగిందని ఆరోపించారు. రెండేళ్లుగా పార్లమెంట్‌లో గొంతెత్తని వైసీపీ ఎంపీలు ఇప్పుడు తనపై అనర్హత వేటు వేయించేందుకు మాట్లాడుతున్నారని.. కానీ అది జరగదని ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు.


Next Story
Share it