ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి : ఎంపీ మిథున్ రెడ్డి
MP Mithun Reddy Demands For AP Special Status. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. పోలవరం నిధులు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్
By Medi Samrat
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. పోలవరం నిధులు తక్షణమే విడుదల చేయాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్‌సభలో కోరారు. పోలవరానికి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లడం లేదని.. భూ సేకరణ చట్టం వల్ల అంచనా వ్యయం పెరిగిందని.. రూ.55,548 కోట్ల సవరించిన అంచనా వ్యయానికి జలశక్తి ఆమోదం తెలిపిందని.. కానీ ఇప్పటి వరకు కేంద్ర ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచిందని వ్యాఖ్యానించారు.
ఇరిగేషన్ కాంపొనెంట్, డ్రింకింగ్ కాంపొనెంట్ పేరుతో.. పోలవరం ప్రాజెక్టు నిధులకు కత్తెర పెడుతున్నారని విమర్శించారు. ఏ జాతీయ ప్రాజెక్టుకూ లేని షరతులు పెట్టి నిధులు తగ్గిస్తున్నారని.. భూ సేకరణ చట్టం కింద నష్టపరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. జాతీయ ప్రాజెక్టును పూర్తిగా కేంద్రమే మిస్ హ్యాండిల్ చేస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. విభజన వల్ల ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయింది. ఏపీకి 56 శాతం జనాభా వస్తే.. ఆదాయం 45 శాతమే దక్కిందని వివరించారు. ఏపీపై 60 శాతం అప్పులు మోపారు. ఈ నష్టం కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని చెప్పారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని పేర్కొన్నారు. ఏపీలో అదనంగా 12 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో నాడు నేడు కింద 55 వేల పాఠశాలల అభివృద్ది చేశామని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాం అని వివరించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తగ్గించడం సరికాదని సూచించారు.