ఆ భూమిని 2000 సంవ‌త్స‌రంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించార‌ని పలు ఆరోపణలు చేశారు.

By -  Medi Samrat
Published on : 13 Nov 2025 5:22 PM IST

ఆ భూమిని 2000 సంవ‌త్స‌రంలోనే కొనుగోలు చేశాం : ఎంపీ మిథున్ రెడ్డి

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించార‌ని పలు ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తూర్పు ఘాట్ పరిసరాల్లోని మంగళం పేటలో ఏరియల్ సర్వే నిర్వహించి ఆ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ ఆక్రమణలపై సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

దీనిపై పెద్దిరెడ్డి తనయుడు, ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మిథున్‌రెడ్డి ఎక్స్‌లో డిమాండ్‌ చేశారు. గతంలో ఎర్రచందనం విషయంపై తమరు చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా అని ప్రశ్నించారు. ఇప్పుడు హెలికాప్టర్ నుంచి చూపించిన భూమి తమ చట్టబద్దమైన సొత్తు అని స్పష్టం చేశారు. తాము ఆ భూమిని 2000లో కొనుగోలు చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ భూములను తాము 2000 సంవత్సరంలోనే చట్టబద్దంగా కొనుగోలు చేశామని తెలిపారు. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఉన్నాయని, వాటిని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చంటూ మిథున్‌రెడ్డి సవాల్ విసిరారు. ముందుగా వాటిని పరిశీలించి, ఆ తర్వాతే మాట్లాడాలని పవన్‌కు ఆయన హితవు పలికారు. గతంలో కూడా ఎర్ర చందనం విషయంలోనూ పవన్ ఇలాగే ఆరోపణలు చేసి పారిపోయారని మిథున్‌ గుర్తు చేశారు.

Next Story