ఎంపీ సీఎం రమేష్ ఇంట తీవ్ర విషాదం

అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

By -  Medi Samrat
Published on : 23 Nov 2025 5:58 PM IST

ఎంపీ సీఎం రమేష్ ఇంట తీవ్ర విషాదం

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయనకు మాతృవియోగం కలిగింది. సీఎం రమేశ్ తల్లి రత్నమ్మ హైదరాబాదులో కన్నుమూశారు. రత్నమ్మ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి కడప తరలించనున్నారు. రేపు సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం పొట్లదుర్తిలో రత్నమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Next Story