అన్నమయ్య జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. అంతకు ముందు రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా, అరెస్టయిన ఉగ్రవాదుల భార్యలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులుగా ఉన్న అబుబక్కర్ సిద్ధిఖీ, మహమ్మద్ ఆలీ అనే సోదరులు మారుపేర్లతో కొన్ని ఏళ్లుగా రాయచోటిలో చీరల వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే వీరిని అరెస్ట్ చేసిన NIA అధికారులు చెన్నై తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు.
రాయచోటికు చెందిన మహిళను అబుబక్కర్ సిద్ధిఖీ వివాహం చేసుకోగా, సుండుపల్లి కు చెందిన మహిళను మహమ్మద్ అలీ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారు రాయచోటి పోలీసుల అదుపులో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో అబుబక్కర్ సిద్ధిఖీ, మహమ్మద్ అలీ బాంబు పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.