విజయవాడలో మంకీపాక్స్ కలకలం చెలరేగిన సంగతి తెలిసిందే..! దుబాయ్ నుంచి వచ్చిన ఓ కుటుంబంలోని చిన్నారి ఒంటిపై దద్దుర్లు రావడంతో విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ చిన్నారికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానించారు. చిన్నారి నుంచి నమూనాలను సేకరించిన అధికారులు పుణె ల్యాబ్‌కు పంపారు. ఆ కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్‌లో ఉంచినట్లు సమాచారం.
దుబాయ్ నుంచి ఇటీవల విజయవాడ వచ్చిన రెండేళ్ల చిన్నారికి మంకీపాక్స్ ను పోలిన లక్షణాలు కనిపించడంతో.. బాలికకు మంకీపాక్స్ అయ్యుంటుందన్న అనుమానంతో నమూనాలు సేకరించి, వాటిని పుణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అయితే ఆ చిన్నారికి మంకీపాక్స్ నెగెటివ్ గా వచ్చింది. ఆ బాలికకు మంకీపాక్స్ కాదని వైద్యులు నిర్ధారించారు. ఆ బాలికకు చర్మంపై మామూలు దద్దుర్లు వచ్చినట్టు వైద్యులు గుర్తించారు.