చంద్ర‌బాబును క‌లిసిన‌ మోహ‌న్ బాబు

Mohan Babu met Chandrababu. ఏపీ రాజ‌కీయాల్లో మంగ‌ళ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది

By Medi Samrat  Published on  26 July 2022 9:15 PM IST
చంద్ర‌బాబును క‌లిసిన‌ మోహ‌న్ బాబు

ఏపీ రాజ‌కీయాల్లో మంగ‌ళ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబుతో ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని చంద్ర‌బాబు నివాసంలో ఈ భేటీ జ‌రిగింది. సినీ న‌టుడిగా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహ‌న్ బాబు తెలుగుదేశం పార్టీ తోనే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టారు. తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న‌ మోహ‌న్ బాబుకు టీడీపీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగా అవ‌కాశం కూడా ద‌క్కింది.

ఆ త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాలకు దూరంగా ఉన్న‌ మోహ‌న్ బాబు.. చంద్ర‌బాబుపై ప‌లు మార్లు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు మోహ‌న్ బాబు వైసీపీలో చేరారు. ఎన్నిక‌ల్లో, ఎన్నిక‌ల త‌ర్వాత‌ ఎలాంటి అవ‌కాశం ద‌క్కకున్నా ఆయ‌న‌ పార్టీలోనే కొన‌సాగారు. కొద్దికాలంగా వైసీపీకి కూడా దూరంగా ఉన్న‌ మోహ‌న్ బాబు.. చంద్ర‌బాబుతో భేటీ కావ‌డం తెలుగు రాజ‌కీయాల్లో కొత్త‌ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.










Next Story