ఈనెల 29తో ముగియనున్న నారా లోకేశ్ పదవీకాలం.. ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ

MLC notification released by Election Returning Officer Subba Reddy at ap assembly. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు

By Medi Samrat  Published on  6 March 2023 8:56 AM GMT
ఈనెల 29తో ముగియనున్న నారా లోకేశ్ పదవీకాలం.. ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ

MLC notification released by Election Returning Officer


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2వ తేదీతో పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగా.. సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి ఫారమ్-1 ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు. ఈనెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకూ సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నాం 3 గం.ల వరకూ నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీన ఉదయం 11గం.లకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈనెల 16వ తేది మధ్యాహ్నం 3గం.ల వరకూ నామినేష్ల ఉసంహరణకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉన్నచో ఈ నెల 23వ తేదీ ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు సా.5గం.లకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


Next Story