రేపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల

MLC Notification In AP. ఏపీలో రేపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇటీవ‌ల‌ ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు

By Medi Samrat  Published on  8 Nov 2021 1:43 PM GMT
రేపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో రేపు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇటీవ‌ల‌ ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఖాళీ ఏర్ప‌డింది. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రేపు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీసీ గోవిందరెడ్డి(వైసీపీ), సోము వీర్రాజు(బీజేపీ), మహమ్మద్ షరీఫ్(టీడీపీ) ల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ మూడు ఖాళీలను భర్తీ చేసేందుకు రేపు( ఈ నెల 9వ తేదీన) కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇదిలావుంటే.. వైసీపీ నుండి మరోసారి డీసీ గోవిందరెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగించే యోచనలో అధిష్టానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. గోవిందరెడ్డిది వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం.

సామాజిక సమీకరణ నేపథ్యంలో ఒక బీసీ, ఒక ఎస్సీ వర్గానికి చెందిన నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని అధిష్టానం నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. ఎస్సీ మాదిగ కోటాలో లబ్బి వెంకటస్వామికి పార్టీ అధిష్టానం ఇవ్వొచ్చని సమాచారం. వెంకటస్వామిది కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం వేంపెంట గ్రామం. వెంకటస్వామి గ‌తంలో పాములపాడు మండలం నుంచి జెడ్పిటిసిగా గెలుపొంది జడ్పీ చైర్మన్ పదవి చేపట్టారు. ఈయనకు వైయస్సార్ కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ అధిష్టానం ఎస్సీ మాల కుల సమీకరణలలో భాగంగా ముగ్గురికి ఎమ్మెల్సీలుగా అవ‌కాశం క‌ల్పించింది. సామాజిక సమతుల్యతలో భాగంగా మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్టు సమాచారం.


Next Story