ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ స్పందించారు.

By -  Medi Samrat
Published on : 20 Sept 2025 6:32 PM IST

ఓజీ సినిమాకు ఇచ్చినట్లుగా.. ఉల్లి, వరి, మిర్చి రైతులకు కూడా ఓ జీవో ఇవ్వొచ్చు కదా..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ స్పందించారు. ఓజీ సినిమాకు అధిక టికెట్‌ ధర ఇచ్చినట్లే ఉల్లి రైతులకు, వరి రైతులకు, మిర్చి రైతులకు కూడా మద్దతు ధర కల్పిస్తున్నట్లు ఒక జీవో ఇవ్వొచ్చు కదా అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టుకు లాభం కోసమే ప్రభుత్వ ఉత్తర్వులు కానీ పేదల కోసం, రైతుల కోసం కాదన్నారు.

ఇక ఓజీ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 21న సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘ఓజీ’ కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అయితే చిత్ర యూనిట్‌లోని మిగతా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Next Story