మైలేజ్ కోసమే బాబు శ్రమదానాన్ని పవన్ భుజానికి ఎత్తుకున్నారు
MLA Sreedhar Reddy Fires On Pawan Kalyan. పొలిటికల్ మైలేజ్ కోసం చంద్రబాబు శ్రమదానం కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ భుజానికి
By Medi Samrat
పొలిటికల్ మైలేజ్ కోసం చంద్రబాబు శ్రమదానం కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీ పొలిటికల్ బాస్ చంద్రబాబు అనంతపురం-అమరావతి హైవే పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారు కానీ పనులు చేయలేదు. ఒక మీటర్ రోడ్డు కూడా వేయలేదని.. అప్పుడు శ్రమదానం గుర్తు రాలేదా? ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం కన్నా వైసీపీ అధికారంలోకి వచ్విన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రతి పల్లెకు రోడ్ కనెక్టెవిటీ ఏర్పాటు చేసామని గర్వంగా చెబుతున్నామని అన్నారు. గత ఏడాది భారీగా కురిసిన వర్షాల వల్ల దెబ్బ తిన్న రోడ్లను మరమ్మత్తులు, రెస్టోరేషన్ చేయడానికి సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే నెలలోనే టెండర్లు పిలిచామన్నారు. ఈ ఏడాది లో కూడా వర్షాలు త్వరగా వర్షాలు పడ్డాయని.. వర్షాకాలం రోడ్ల నిర్మాణంకు అనువైన సమయంకాదని.. అందుకే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించలేదని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కి చెప్పేది ఒకటే.. శ్రమదానం పేరుతో ప్రజలను మభ్యపెట్టొద్దని అన్నారు. కొత్త చెరువు- ధర్మవరం రోడ్డు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని అన్నారు. వర్షాలు తగ్గినందున రోడ్ల నిర్మాణం స్పీడ్ గా జరుగుతోందని. తెలిపారు. వైసీపీ సర్కారుకు చిత్తశుద్ది వుంది కనుకే.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేల భాగస్వామ్యంతో ఏపీలో రోడ్ల నిర్మాణం జోరుగా జరుగుతోందని అన్నారు. జగన్ నాయకత్వంలో ముదుగుబ్బ-పుట్టపర్తి- కోడూరు రోడ్డు నిర్మాణం కోసం 1200 కోట్లు ఖర్చు పెడుతున్నామని.. ముద్దనూరు- హిందూపురం వరకు వయా కదిరి, ఓడీసీ, గోరంట్ల మీదుగా రూ.3000 కోట్ల రూపాయలతో కేవలం రోడ్లకోసం ఖర్చు పెడుతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ది పబ్లిసిటీ స్టంట్.. మాది పబ్లిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ అని అన్నారు. మాది చేతల ప్రభుత్వం చెప్పింది.. ఆచరణలో పూర్తి చేస్తామని తెలిపారు.