రోజా టీచర్..!
MLA Roja Turned As a Teacher. వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సరికొత్త అవతారం ఎత్తారు. అటు రాజకీయాలతో..
By అంజి Published on 29 Aug 2021 9:27 AM ISTటీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
విద్యార్థులకు పాఠాలు బోధించిన రోజా
వైసీపీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సరికొత్త అవతారం ఎత్తారు. అటు రాజకీయాలతో.. ఇటు టీవీ షోలతో బీజీగా ఉండే రోజా సడెన్‌గా టీచర్‌గా మారిపోయారు. ఓ పాఠశాలలోని తరగతి గదిలోకి వెళ్లి బోధన చేశారు. తొమ్మిదో తరగతి సోషల్ సబ్జెక్ట్‌లోని భూమి - మనం అనే పాఠ్యాంశాన్ని బోధించారు. పాఠ్యాశంలో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు.
చిత్తూరు జిల్లాలోని నిండ్ర మండలం అత్తూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. రూ.27.83 లక్షల వ్యయంతో నాడు - నేడు పనుల కిందన రూపు రేఖలు మార్చిన ప్రభుత్వ స్కూలు భవనాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా ఓ క్లాస్ తీసుకున్నారు. విద్యార్థులు మంచి భవిష్యత్తును ఎంచుకోవాలని, అలాగే విద్యార్థినులు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలన్నారు. చదువుకున్న వాళ్లు రాజకీయాల్లోకి వస్తే చాలా మిరాకిల్స్ జరుగుతాయని అన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని ఎమ్మెల్యే రోజా చెప్పారు. నాడు - నేడు కింద పాఠశాలలను సీఎం జగన్ ఆధునీకరిస్తున్నారని ఎమ్మెల్యే రోజా వివరించారు.