తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా తిప్పికొట్టారు. ఏపీకి కేటాయించిన నీళ్లు కాకుండా.. అదనంగా చుక్క నీళ్లు కూడా వాడుకోవడం లేదనే విషయం ప్రశాంత్‌ రెడ్డి తెలుసుకోవాలని.. ప్రజల మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం చేయటం మంచిది కాదని హితవు పలికారు. ఒక మంత్రి అయి ఉండి సీఎంను గజదొంగ అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని రోజా అన్నారు.

ఇదిలావుంటే.. మహబూబ్ నగర్ పర్యటనలో తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం కడుతున్న అక్రమ ప్రాజెక్టులపై ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులేనని.. ఆంధ్రోళ్లు ఎప్పటికీ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఉంటారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ నీటి దొంగ అయితే.. జగన్ గజదొంగ అని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకోరని, తగిన చర్యలు తీసుకుంటారని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.


సామ్రాట్

Next Story