వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్ డే.. ఎమ్మెల్యే రోజా ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..?

MLA Roja Birthday Gift to CM Jagan. ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా న‌గ‌రి

By Medi Samrat  Published on  21 Dec 2020 11:24 AM IST
వైఎస్ జ‌గ‌న్ బ‌ర్త్ డే.. ఎమ్మెల్యే రోజా ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..?

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు సంద‌ర్భంగా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇచ్చిన గిఫ్ట్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఆమెను మెచ్చుకుంటున్నారు. ఇంత‌కీ ఎమ్మెల్యే రోజా ఏం గిఫ్ట్ ఇచ్చారంటే.. త‌ల్లి దండ్రులు కోల్పోయి చ‌దువుకోవ‌డానికి ఇబ్బందులు ప‌డుతున్న ఓ పేద విద్యార్థిని ని డాక్ట‌ర్ చ‌దివించే బాధ్య‌త‌ను తీసుకున్నారు.

మంచి మనిషి జన్మదినాన ఒక మంచి పని..! మన అందరి ప్రియతమ నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టడం జరిగింది. పి.పుష్పకుమారి అనే ఈ చిన్నారి పూర్తి చదువుకు నేను దత్తత తీసుకోవడం జరిగింది అని రోజా ట్వీట్ చేశారు.

ఓ లేఖ‌ను కూడా రాశారు. పుష్ప‌కుమారి అనే ఈ చిన్నారి త‌న బాల్యంలోనే త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయింది. కానీ డాక్ట‌ర్ అవ్వాల‌నే త‌న ఆశ‌యాన్ని మాత్రం వ‌దులుకోలేదు. మ‌న పిల్ల‌లు చ‌దువుకోవాలి అందులోనూ మ‌రి ముఖ్యంగా ప్ర‌తి ఆడ‌పిల్ల త‌ప్పనిస‌రిగా విద్యాప‌రంగా ఎద‌గాలి అని న‌మ్మే జ‌గ‌న‌న్న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ చిన్నారి పూర్తి చ‌దువుకు నేను ద‌త్త‌త తీసుకోవ‌డం జ‌రిగింది. మ‌న‌కు న‌చ్చిన వారి పుట్టిన రోజున కేవ‌లం బొకేలు ఇవ్వ‌కుండా ఒక బంగారు త‌ల్లి భ‌విష్య‌త్తుకి బాట వెయ్య‌డం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. విద్యకు పెద్ద పీట వేస్తూ ఎంతో మంది చిన్నారుల‌కు మేన‌మామ‌గా మారిన మ‌న జ‌గ‌న‌న్న‌కు ఇదే నా పుట్టిన రోజు బ‌హుమ‌తి.. హాపీ బ‌ర్త్‌డే జ‌గ‌న‌న్న అంటూ ఆ లేఖ‌లో రాసుకొచ్చారు రోజా.






Next Story