ప్రజల్లో సింపతి కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు

MLA Pinnelli Ramakrishna Reddy Comments On Macherla Incident. చంద్రబాబు కావాలనే మాచర్లలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.

By Medi Samrat
Published on : 17 Dec 2022 3:25 PM IST

ప్రజల్లో సింపతి కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు

చంద్రబాబు కావాలనే మాచర్లలో అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్లాన్‌ ప్రకారం టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదని.. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగలబెట్టారని అన్నారు. ప్రజల్లో సింపతి కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్లాన్ ప్రకారం వైఎస్ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడి చేశార‌ని మండిప‌డ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు కలిసి నాటకం ఆడుతున్నారని.. బ్రహ్మారెడ్డి ద్వారా మాచర్లలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గొడవకు కారణమైన బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు, లోకేష్‌ ప్లాన్‌ ప్రకారమే దాడులు జ‌రిగాయ‌ని.. రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. బీసీలు సీఎం జగన్‌ వైపు ఉన్నారని తట్టుకోలేకపోతున్నారని అన్నారు. బ్రహ్మారెడ్డిని అడ్డంపెట్టుకుని చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమ‌ర్శించారు. చంద్రబాబు, లోకేష్‌ రాజకీయ లబ్ది కోసం గొడవలు చేస్తున్నారని.. బీసీలను దూషించి దాడులు చేయడం హేయం అని దాడి ఘ‌ట‌న‌ను ఖండించారు.


Next Story