బిగ్‌బ్రేకింగ్ : ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

MLA Ganta Srinivasa Rao Resigns. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on  6 Feb 2021 9:06 AM GMT
బిగ్‌బ్రేకింగ్ : ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా

మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ‌ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అమలులోకి వచ్చిన వెంటనే.. తన రాజీనామాను ఆమోదించాలని గంటా శ్రీనివాసరావు స్పీకర్ కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను మాటల మనిషిని కానని, చేతల మనిషనని.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజ‌కీయేత‌ర‌ జేఏసీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు గంటా శ్రీనివాసరావు తెలిపారు.
Next Story
Share it