రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ

తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.

By Medi Samrat
Published on : 3 May 2025 9:04 PM IST

రాజీనామా చేయడానికి సిద్ధం : భూమా అఖిల ప్రియ

తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. అహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని అఖిలప్రియ అన్నారు. కొందరు పదే పదే అబద్ధాలు చెబుతూ ఉన్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను తాము సరిదిద్దే పనిలో ఉన్నామని, అది మింగుడుపడక తమపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కొందరు కథనాలను ప్రసారం చేస్తున్నారని ధ్వజమెత్తారు అఖిలప్రియ. తాను గతంలోనూ ఇదే సవాల్ చేసినా కూడా వైసీపీ నాయకులు ముందుకు రాలేదని అన్నారు. అహోబిలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన ప్రతి ఒక్క భవనాన్ని కూల్చివేద్దామని అఖిల ప్రియ అన్నారు. అక్రమ నిర్మాణాలు ఎన్నో చేపట్టారని., అలాంటి వాటిపై గత ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోలేదని అన్నారు.

Next Story