తాడేపల్లి హత్యాచార బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం

Ministers Visit Guntur GGH Hospital. తాడేపల్లి హత్యాచార ఘటన బాధితురాలిని మంత్రులు సుచరిత, తానేటి వనిత సోమ‌వారం నాడు పరామర్శించారు

By Medi Samrat  Published on  21 Jun 2021 10:18 AM GMT
తాడేపల్లి హత్యాచార బాధితురాలికి రూ. 5 లక్షల పరిహారం

తాడేపల్లి హత్యాచార ఘటన బాధితురాలిని మంత్రులు సుచరిత, తానేటి వనిత సోమ‌వారం నాడు పరామర్శించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో పరామర్శ‌కు వెళ్లిన‌ మహిళా మంత్రులు.. గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న భాదితురాలితో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. హత్యాచార ఘటనను హేయమైన చర్యగా ఖండించారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.

ఇప్పటికే నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయన్న హోంమంత్రి.. సీఎం జ‌గ‌న్‌ భాదితురాలికి తక్షణ సాయంగా రూ. 5 లక్షల పరిహారం ప్రకటించనట్లు తెలిపారు. మంత్రి తానేటి వనిత మహిళా శిశు సంక్షేమ శాఖ తరుపున రూ. 50 వేలు సాయం అందించారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని హోం మినిస్టర్ పోలీసులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సుచరిత తెలిపారు.


Next Story