అది చంద్రబాబు దిగజారుడు తనమే: మంత్రి ఉషశ్రీ

పెనుగొండలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభ భారీ ఫెయిల్యూర్ ను మూట గట్టుకుందని మంత్రి ఉష శ్రీ చరణ్ అన్నారు.

By Medi Samrat
Published on : 5 March 2024 4:15 PM IST

అది చంద్రబాబు దిగజారుడు తనమే: మంత్రి ఉషశ్రీ

పెనుగొండలో టీడీపీ నిర్వహించిన రా కదలిరా సభ భారీ ఫెయిల్యూర్ ను మూట గట్టుకుందని మంత్రి ఉష శ్రీ చరణ్ అన్నారు. ఇంతకు ముందు వాలంటీర్లను తిట్టిన టీడీపీ చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థను అలాగే ఉంచుతామని చెబుతూ ఉండడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రెండు రోజుల ముందు వరకు వాలంటీర్లను కించపరిచిన చంద్రబాబు పెనుగొండ సభలో వాలంటీర్లను కొనసాగిస్తామని.. టీడీపీకి పని చేయడంటూ అడుక్కోవడం చంద్రబాబు దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. రాప్తాడు సిద్ధం సభలో పార్కింగ్‌ స్థలంలో సగం కూడా చంద్రబాబు రా కదలిరా సభకు జనం రాలేదని అన్నారు. సిద్ధం సభ సముద్రమైతే రా కదలిరా సభ పిల్ల కాలువ అని అన్నారు.

చంద్రబాబు వాలంటీర్ల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసివేయమని.. ఎప్పటికీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని స్పష్టం చేశారు. వాలంటీర్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని, జీతాల విషయంలో వారికి న్యాయం చేస్తామని అన్నారు. వైసీపీ కోసం వాలంటీర్లు పని చేయొద్దని సూచించారు.

Next Story