బెయిల్‌ పొడిగించడానికే కట్టుకథలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై

By Medi Samrat  Published on  17 Nov 2023 12:45 PM GMT
బెయిల్‌ పొడిగించడానికే కట్టుకథలు

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిపారు. స్కిల్ కేసులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది.

చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై చెబుతున్నవన్నీ కట్టుకథలేనని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. చంద్రబాబు జబ్బుల రిపోర్ట్‌లు డాక్టర్‌గా పరిశీలించానన్న మంత్రి.. రిపోర్టులలో వ్యాధులు సీరియస్‌గా ఉన్నాయని రాశారన్నారు. హై రిస్క్ కేసును ఏఐజీ హాస్పిటల్ నుంచి ఎలా డిశ్చార్జ్ చేశారని, కంటి ఆపరేషన్‌కు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. నిజం గెలవాలని తిరిగిన ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు. నిజం గెలిస్తే.. చంద్రబాబుకి జీవిత కాలం జైలు శిక్ష పడుతుందన్నారు. బెయిల్ వచ్చిన వెంటనే ఓదార్పు యాత్రను ఆపేశారని, ఇదేం అన్యాయమన్నారు.

Next Story