Andrapradesh: చేనేత సహకార సంఘాలకు మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త
అమరావతి: రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలకు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత సంక్రాంతి శుభవార్త చెప్పారు. చేనేత సహకార సంఘాలకు రూ.5 కోట్ల విడుదలకు మంత్రి సవిత ఆదేశాలు జారీ చేశారు. కాగా మంత్రి ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు ఆప్కో నిర్ణయం తీసుకుంది. రేపు చేనేత సహకార సంఘాల ఖాతాల్లో రూ.5 కోట్ల బకాయిల జమ చేయనుంది. కాగా గత నెలలో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించింది. దీంతో మంత్రి సవితకు చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, నేతన్నలు ధన్యవాదాలు తెలిపారు.