కొడాలి నాని భాషలో తప్పేముంది: మంత్రి రోజా
Minister Roja says YCP is ready to face TDP's criticism of Kodali Nani. ఉద్యోగ క్యాలెండర్‌పై చర్చకు డిమాండ్ చేస్తూ తొలిరోజు శాసనసభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు
By అంజి Published on 15 Sep 2022 9:29 AM GMTఉద్యోగ క్యాలెండర్‌పై చర్చకు డిమాండ్ చేస్తూ తొలిరోజు శాసనసభ కార్యక్రమాలకు అంతరాయం కలిగించినందుకు టీడీపీపై మంత్రి రోజా సెల్వమణి మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమైతే వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో తెలుసుకోవచ్చన్నారు. ప్రజల మద్దతుతోనే తమ ప్రభుత్వం సవరించిన మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడుతోందని రోజా అన్నారు.
మూడు రాజధానులకు మద్దతివ్వడం వల్లే అమరావతి సహా అన్ని ప్రాంతాల్లో వైసీపీ భారీ మెజారిటీతో విజయం సాధించిందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన భాషను మంత్రి రోజా సమర్థించారు. కొడాలి నానిపై టీడీపీ దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని రోజా అన్నారు.
నాని చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పిదం లేదని, పనికిరాని విషయాన్ని టీడీపీ నేతలు ఎత్తిచూపాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా? అని మంత్రి ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైసీపీ ఎమ్మల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్నారు. రాంగ్ రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్.. సీఎం జగన్‌పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు. టీడీపీ రౌడీయీజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా? అంటూ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.