డోసు పెంచిన మంత్రి రోజా.. చీరలు కట్టుకోవాలంటూ టీడీపీ నేత‌ల‌పై సెటైర్లు

Minister Roja Fire On TDP Leaders. టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని పర్యాటక శాఖ మంత్రి రోజా విమ‌ర్శించారు.

By Medi Samrat  Published on  27 April 2022 5:13 PM IST
డోసు పెంచిన మంత్రి రోజా.. చీరలు కట్టుకోవాలంటూ టీడీపీ నేత‌ల‌పై సెటైర్లు

టీడీపీ.. మహిళా ద్రోహి పార్టీ అని పర్యాటక శాఖ మంత్రి రోజా విమ‌ర్శించారు. బుధ‌వారం ఆమె మాట్లాడుతూ.. తెలుగుదేశంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. చీరలు కట్టుకోవాల్సిన నాయకుడు చంద్రబాబు అని అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. చీరలు కట్టుకోవాల్సింది చంద్రబాబు, లోకేష్‌లేన‌ని.. చీర కావాలో, చుడీదార్ కావాలో టీడీపీ నేతలు ఆలోచించుకోవాలని వ్యంగంగా మాట్లాడారు. పచ్చ చీర కావాలా..? పసుపు చీర కావాలా..? టీడీపీ నేత‌లు తేల్చుకోవాల‌న్నారు.

మహిళల రక్షణ కోసం దిశ యాప్‌.. దిశ పోలీస్‌ స్టేషన్లు తీసుకొచ్చామ‌ని మంత్రి రోజా అన్నారు. సంక్షేమ పథకాల్లో 75 శాతం వాటా మహిళలదేన‌ని అన్నారు. మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్ అని కొనియాడారు. మహిళల పక్షపాత ప్రభుత్వం మాది అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.

Next Story