తారకరత్నకు సీరియస్‌గా ఉన్నా పట్టించుకోకుండా వైసీపీపై ఆరోపణలా: మంత్రి రోజా

Minister Roja Fire on Nara Lokesh. టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. అతనే ఐరెన్ లెగ్ అని.. టీడీపీ నేతలు

By Medi Samrat  Published on  28 Jan 2023 7:08 PM IST
తారకరత్నకు సీరియస్‌గా ఉన్నా పట్టించుకోకుండా వైసీపీపై ఆరోపణలా: మంత్రి రోజా

టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. అతనే ఐరెన్ లెగ్ అని.. టీడీపీ నేతలు మహిళలకు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారో అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు సైకో అయితే లోకేష్ ఐరెన్ లెగ్ సైకో అన్నారు రోజా. లోకేషే ఏం చేసినా ప్రమాదమేనని, ఈ ఐరెన్ లెగ్ రాష్టం అంతా తిరిగితే మా పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రజలు భయపడుతూ ఉన్నారని అన్నారు. లోకేష్ మొదటి సారి గోదావరి పుష్కరాలకు వస్తే 29 మంది చనిపోయారని గుర్తు చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఆయిన వెంటనే వాళ్ళ బాబు చంద్రబాబుకు ఓటుకు నోట్ నోటీసులు వచ్చాయన్నారు. యువ గళం పోస్టర్ రిలీజ్ చేసిన రోజే కందుకూరు లో 8 మంది చనిపోయారనీ, ఇప్పుడు లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే తారకరత్న కు గుండె పోటు వచ్చిందని అన్నారు మంత్రి రోజా. తారకరత్నకు అంత సీరియస్‌గా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా వైసీపీపై ఆరోపణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందిన సైకో లోకేష్ అంటూ విమర్శించారు మంత్రి రోజా.

తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు వెల్లడించారు. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెన్సివిస్ట్‌లతో సహా మల్టీ- డిసిప్లినరీ క్లినికల్ టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బెలూన్ యాంజియోప్లాస్టీతో ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్తిమ శ్వాస కొనసాగుతున్నట్టుగా తెలిపారు.


Next Story