కేటీఆర్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి : మంత్రి పొన్నం

మీ బీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్ర‌శ్నించారు.

By Medi Samrat  Published on  30 March 2024 4:30 PM IST
కేటీఆర్.. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి : మంత్రి పొన్నం

మీ బీఆర్ఎస్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఏమి న్యాయం చేశారో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్ర‌శ్నించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మీరే అన్ని ముఖ్యమైన పదవులు చేపట్టి కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. బలహీన వర్గాలకు ఏమి చేశారో బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్ర‌శ్నించారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమ‌న్నారు.

కాంగ్రెస్ అధికారం వచ్చాక కులగణన చేపట్టామన్నారు. 16 కులాలకు కార్పొరేషన్ లు కేటాయించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే అడిగే స్వేచ్ఛ మాకుందని అన్నారు. 23 ఏళ్ల‌లో బీఆర్ఎస్ పార్టీలో బలహీన వర్గాలకు ఏ ఒక్కరికి న్యాయం చేయలేదని అన్నారు. బీజేపీ బలహీన వర్గాల వ్యక్తిని అధ్యక్ష పదవి నుండి తొలగించి కిషన్ రెడ్డి కి ఇచ్చిందన్నారు. కేటీఆర్ వొళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో చేసిన మోసాలు అన్ని బయటకు వొస్తున్నాయన్నారు.

Next Story