బ్రేకింగ్: ఏపీ ర‌వాణా శాఖ మంత్రి విశ్వ‌రూప్ కు అస్వస్థత

Minister Pinipe Viswaroop Admited Hospital Due toIllness. వైసీపీ కీల‌క నేత‌, ఏపీ ర‌వాణా శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం

By Medi Samrat
Published on : 2 Sept 2022 5:40 PM IST

బ్రేకింగ్: ఏపీ ర‌వాణా శాఖ మంత్రి విశ్వ‌రూప్ కు అస్వస్థత

వైసీపీ కీల‌క నేత‌, ఏపీ ర‌వాణా శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న విశ్వ‌రూప్‌ శుక్ర‌వారం దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర్ధంతి సంద‌ర్భంగా అమ‌లాపురంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

పార్టీ శ్రేణుల‌తో క‌లిసి ఆయ‌న ఉత్సాహంగా క‌నిపించారు. ఈ కార్యక్రమం ముగిసిన కొద్దిసేపటికే విశ్వ‌రూప్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. విశ్వ‌రూప్‌ను హుటాహుటిన రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విశ్వ‌రూప్ అస్వ‌స్థ‌త‌కు కారణం ఏమిటనే విష‌యం తెలియ‌రాలేదు. విశ్వ‌రూప్ ప‌రిస్థితిపై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం చేర‌వేశారు.


Next Story