జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితం

Minister Perni Nani Inspects Jagananna layouts. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో

By Medi Samrat
Published on : 29 March 2022 8:30 PM IST

జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితం

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కచ్చితంగా ఉండాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం మండలంలోని గిలకలదిండి, బందరుకోట, ఉల్లింగిపాలెంలో లబ్ధిదారులకు కేటాయించిన జగనన్న లేఔట్‌లను మంత్రి పేర్ని నాని ప్రభుత్వ అధికారులు మంగళవారం సాయంత్రం పరిశీలించారు.

పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎక్కడా నిధులు కొరత అనే సమస్య లేదని మంత్రి స్పష్టం చేశారు. మండలంలో గిలకలదిండిలో 26 ఎకరాలలో లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సెంటున్నర చొప్పున ఇళ్లస్ధలం కేటాయించామని.. బందరుకోటలో 10 ఎకరాలు, ఉల్లింగిపాలెంలో 17 ఎకరాలు లబ్ధిదారులకు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమని.. ఏమాత్రం కూడా అధికారులు అలసత్వంతో వ్యవహరించకూడదని మంత్రి పేర్ని నాని సూచించారు.










Next Story