పవన్‌కల్యాణ్‌కు మంత్రి పేర్నినాని కౌంట‌ర్‌

Minister Perni Nani Comments On Pawan Kalyan. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం థియేటర్లను

By Medi Samrat  Published on  26 Sep 2021 2:11 PM GMT
పవన్‌కల్యాణ్‌కు మంత్రి పేర్నినాని కౌంట‌ర్‌

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మంత్రి పేర్నినాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం థియేటర్లను మూసివేయించిందని పవన్‌ వ్యాఖ్యానించారు.. ఏపీలో 1100 థియేటర్లు ఉంటే 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని.. తెలంగాణలో 519కి గానూ 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ఆడుతున్నాయని తెలిపారు. తెలంగాణలో కంటే ఏపీలోనే సినీ నిర్మాతలకు ఎక్కువ షేర్‌ వస్తోందని అన్నారు. సినీ ఇండస్ట్రీని ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందిపెట్టిందో పవన్‌ చెప్పాలి? అని మంత్రి ప్రశ్నించారు. పవన్‌కు కేంద్రంలో సినిమా లేదని.. అంతా సొల్లు చెబుతారని విమర్శించారు.

టాక్స్‌లు, జీఎస్టీ ఎందుకు కట్టాలని ప‌వ‌న్‌ కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. రిపబ్లిక్‌ ఇండియా కాబట్టే.. మీరు ఏం వాగినా చెల్లుతోందన్న మంత్రి పేర్నినాని కౌంట‌రిచ్చారు. కోడికత్తి కేసును ఎన్ఐఏ విచారిస్తోందని.. వివరాలు అమిత్‌షాను అడిగి తెలుసుకోండని సూచించారు. 'మా' ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్‌ తాపత్రయ ప‌డుతున్నార‌ని అన్నారు.

వకీల్‌సాబ్‌ సినిమాకు ఏపీలో వచ్చిన నిర్మాతల షేర్‌ రూ.50 కోట్లపైనే అని తెలిపారు. వకీల్‌సాబ్‌ సినిమాకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్‌ వచ్చిందని.. పవన్‌కల్యాణ్‌ ఇష్టానుసారం మాట్లాడితే తాట తీస్తామని మంత్రి పేర్నినాని హెచ్చరించారు. రెండు చోట్లా ఓడిపోయినవాడు సన్నాసి కాదా? అని ఆయన ప్రశ్నించారు. తాను సన్నాసి అయితే.. పవన్‌ సన్నాసిన్నర అని మంత్రి తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంపై పవన్‌ అవాకులు, చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.


Next Story
Share it