'మా' ఎన్నికలకు.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.!

Minister Perni Nani About MAA Elections. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో

By Medi Samrat  Published on  4 Oct 2021 7:21 PM IST
మా ఎన్నికలకు.. ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు.!

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ కు జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వానికి, సీఎం జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి, ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. ఏపీలో థియేట‌ర్ల స‌మ‌స్య‌లు, ఆన్‌లైన్ టికెట్ విధానం, ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు ఇటీవ‌ల టాలీవుడ్ నిర్మాతలు పేర్ని నానితో భేటీ అయిన విష‌యం తెలిసిందే. భేటీ అనంత‌రం నిర్మాత‌ దిల్ రాజు మాట్లాడుతూ.. చిరంజీవి, నాగార్జున, రాజమౌళితో కలిసి గతంలోనే సీఎంను కలిశామ‌ని.. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం, సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామ‌ని అన్నారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయాయని.. దయచేసి అందరూ వివాదాలకు మమ్మల్ని దూరంగా ఉంచండని కోరారు. గతంలో మా విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని.. ఆన్‌లైన్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామ‌ని.. ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్స్‌ఫ‌రెన్సీ ఉంటుంద‌ని అన్నారు.



Next Story