చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

Minister Peddireddy Fires On Chandrababu. ఏపిలో ఓ వైపు ఎన్నికల కోలాహలం నడుస్తుంటే.. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పై

By Medi Samrat  Published on  9 March 2021 1:15 PM GMT
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

ఏపిలో ఓ వైపు ఎన్నికల కోలాహలం నడుస్తుంటే.. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ పై రగడ కొనసాగుతుంది. నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ స్టీల్ ప్లాంట్ నూటికి నూరుపాళ్లు ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పడంతో ఇక్కడి ఉద్యమం మరింత వేడేక్కిపోయింది. తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాబోరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి టీడీపీలో కనీసం కొంతమంది ఎమ్మెల్యేలైనా ఉన్నారని.. తాను సీఎం అయ్యుంటే టీడీపీలో కేవలం చంద్రబాబు మాత్రమే మిగిలేవారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన చెప్పారు. ఆయనకు పదవీ వ్యామోహం ఇంకా ఉందని.. దానికోసం ఎన్నో కుతంత్రాలు పన్నుతున్నారని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ్ కావడం ఏ ఒక్క తెలుగు వారికి ఇష్టం లేదని.. ఇందుకోసం సీఎం జగన్ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు. చంద్రబాబు చెబుతున్నట్టు రాజీనామాలు చేసినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందా? అని ప్రశ్నించారు.

పంచాయతీ ఎన్నికల్లో ఓడిన బాధతో చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం 90 శాతం వైసీపీ విజయం సాధిస్తుందని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి సీఎం గనుక ఇంకా టీడీపీలో కొంతమంది శాసన సభ్యులు ఉన్నారు.. అదే సీఎంగా నేనైతే చంద్రబాబు మాత్రమే ఆ పార్టీలో మిగిలేవారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లను ఢిల్లీకి తీసుకెళ్తామని జగన్ చెప్పారని.. ఏ సమస్యపైన అయినా, ఒక్కసారైనా చంద్రబాబు అఖిలపక్షం పెట్టారా? అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.




Next Story