చంద్రబాబు, పవన్ విమర్శలను ప్రజలు పట్టించుకోట్లేదు: మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy fired on Chandrababu and Pawan Kalyan. గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి

By అంజి  Published on  19 Jan 2023 3:44 PM IST
చంద్రబాబు, పవన్ విమర్శలను ప్రజలు పట్టించుకోట్లేదు: మంత్రి పెద్దిరెడ్డి

గుంటూరు జిల్లా మంగళగిరిలో రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ప్రారంభించారు. రాష్ట్ర అటవీ శాఖ కార్యాలయాన్ని విజయవాడ నుంచి గుంటూరుకి మార్చడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ శుభ ముహూర్తానా ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతుందన్నారు. 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న ఇంత గొప్ప పరిపాలన రాష్ట్రంలో చూడలేదన్నారు.

తన రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి రాలేదంటూ పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను పెద్దిరెడ్డి ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన ఛీప్‌ పవన్‌కల్యాణ్‌లు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోవడం లేదని చెప్పిన పెద్దిరెడ్డి.. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా ప్రజల మద్దతుతోనే సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.

Next Story