ఆ డ‌బ్బులు రావ‌డానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించాం

అమరావతికి కేంద్ర సాయంపై మంత్రి నారాయణ శాస‌న‌మండ‌లిలో సమాధానం ఇచ్చారు.

By Medi Samrat  Published on  19 March 2025 3:19 PM IST
ఆ డ‌బ్బులు రావ‌డానికి లేట్ అవుతుంది.. అందుకే బడ్జెట్‌లో రూ.6,000 కోట్లు కేటాయించాం

అమరావతికి కేంద్ర సాయంపై మంత్రి నారాయణ శాస‌న‌మండ‌లిలో సమాధానం ఇచ్చారు. అమ‌రావ‌తికి ప్ర‌పంచ బ్యాంకు, ఏషియ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు రుణం ఇస్తున్నార‌ని.. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి కూడా స్ప‌ష్ట‌త ఇచ్చారని వెల్ల‌డించారు. అయితే.. ఈ నిధుల్లో గ్రాంట్ ఎంత‌...? రుణం ఎంత.? అనేది చ‌ర్చించి చెబుతామ‌ని అన్నారు.. హడ్కో ద్వారా 11 వేల కోట్లు రుణం తీసుకుంటున్నామ‌ని.. కేఎఫ్‌డ‌భ్ల్యూ అనే జర్మన్ బ్యాంక్ రూ.5000 కోట్లు లోన్ ఇస్తుందని.. మొత్తం 31వేల కోట్లు అమరావతికి వివిధ రూపాల్లో వస్తున్నాయని వివ‌రించారు.

అమరావతికి రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుందని.. అమ‌రావ‌తి రైల్వే ప్రాజెక్ట్ కు అవ‌స‌ర‌మైన భూమిని ఎలా సేక‌రించాల‌నే దానిపై చ‌ర్చిస్తున్నామ‌ని.. అమరావతి డిజైన్ చేసినప్పుడే సెల్ఫ్ సస్టైనబుల్ గా డిజైన్ చేశారన్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభించడానికి బడ్జెట్‌లో 6,000 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రజలు టాక్స్‌ల రూపంలో చెల్లించిన డబ్బులు అమరావతికి వాడకూడదనేది సీఎం చాలా క్లియర్‌గా చెప్పారన్నారు. రాజ‌ధాని కోసం తీసుకున్న రుణాల‌ను అమ‌రావ‌తి పూర్తయిన తర్వాత అక్క‌డి భూములతో రీ పేమెంట్ చేస్తామన్నారు. బ్యాంకుల‌ ద్వారా డబ్బులు రావడానికి లేట్ అవుతుంది. ఈ బడ్జెట్లో కేటాయించిన 6000 కోట్లతో పనులు ప్రారంభిస్తామ‌ని.. రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేస్తామ‌ని పేర్కొన్నారు.

Next Story