పిఠాపురం పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, పోలీసులను కోరారు. హోంమంత్రి అనిత కూడా ఇటీవల జరుగుతున్న ఘటనలపై బాధ్యత వహించాలన్నారు. నేను ఆ బాధ్యతలు తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయన్నారు. క్రిమినల్స్‌కు కులం, మతం ఉండదు.. పోలీసులకు ఎన్నిసార్లు చెప్పాలి..? అత్యాచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నేతలు ఇలానే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉంటే హోంమంత్రి బాధ్యతలు కూడా నేనే తీసుకుంటా' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ వ్యాఖ్యలు టీడీపీలో అలజడి రేపాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారాయణ స్పందించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలకు పోర్ట్ ఫోలియోలపై స్పందించే స్వేచ్ఛ ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను అలర్ట్‌గా తీసుకోవాలన్నారు.సీఎం అందరినీ కో-ఆర్డినేట్ చేయగలరని మంత్రి నారాయణ అన్నారు.