టీడీపీపై కక్షతోనే వారిని ఇబ్బందులకు గురిచేసింది : మంత్రి నారాయణ
టీడీపీపై కక్షతో గత ప్రభుత్వం టిడ్కో లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు మంత్రి పొంగూరు నారాయణ
By Medi Samrat Published on 20 Nov 2024 9:50 AM GMTటీడీపీపై కక్షతో గత ప్రభుత్వం టిడ్కో లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. టిడ్కో ఇళ్ల లబ్దిదారుల సమస్యలు త్వరలోనే పరిష్కరించేలా ముందుకెళ్తున్నామన్నారు.. గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్ల పై తీసుకున్న రుణాలకు సంబంధించి శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీలు తిరుమల నాయుడు,దువ్వారపు రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు..గత ప్రభుత్వం వివిధ రూపాల్లో 5546.48 కోట్లు రుణం తీసుకుందన్నారు మంత్రి.వివిధ సంస్థల ద్వారా 3175.61 కోట్లు,లబ్దిదారుల పేరు మీద 2184.86 కోట్లు,పట్టణ ప్రణాళికా విభాగం లోని ఎల్ ఆర్ ఎస్ నిధులు 195.81 కోట్లు రుణంగా తీసుకుందన్నారు..
2014 లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు లక్షల 1480 ఇళ్లకు కేంద్రం నుంచి అనుమతి తీసుకుని 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చాం..వీటిలో 3,13,832 ఇళ్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రౌండ్ అయ్యాయి.గత ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో మొత్తం 5 లక్షల ఇళ్లలో 2లక్షల 38 వేల 360 ఇళ్లను రద్దు చేసి కేవలం 2 లక్షల 61 వేల 660 ఇళ్లు మాత్రమే టేకప్ చేసింది.
సీఎం చంద్రబాబు పేదవారికి సైతం గేటెడ్ కమ్యూనిటీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించడంతో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా హైక్వాలిటీతో హైటెక్నాలజీ గత షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం చేపట్టాం.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల కోసం నిర్మించే ఇళ్లకు టేక్ వుడ్ తో ప్రధాన ద్వారం ఏర్పాటు చేసాం.కిచెన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ సింక్,అటకలు,కప్ బోర్డులు,ఏ గ్రేడ్ వర్టిఫైడ్ టైల్స్ తో ఫ్లోరింగ్,స్టీల్ విండోస్,కమ్యూని టీ హాల్,లిఫ్ట్,అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ తో పాటు ఇళ్ల మధ్య పెద్ద పెద్ద రోడ్లు ఉండేలా నిర్మాణం చేపట్టాం...అయితే రోడ్లను కూడా చాలా చిన్నవిగా మార్చేసింది ప్రభుత్వం... చేయగా గత ప్రభుత్వం చిన్న చిన్న రోడ్లు ఏర్పాటు చేసింది.గత ప్రభుత్వం చేసిన పనులతో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాకుండా రెండు రకాల ఇళ్లకు లబ్దిదారులు చెల్లించే డబ్బును తగ్గిస్తున్నామని చెప్పడంతో వారికి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వకుండా మోసం చేయడంతో ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయాల చుట్టూ లబ్దిదారులు తిరుగుతున్నారని మంత్రి చెప్పారు.మొత్తం 2లక్షల61వేల590 మందికి 349కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది.మరో 77,606 మంది 2275.24 కోట్లు బ్యాంకుల నుంచి లోన్ లు తీసుకున్నప్పటికీ వారిలో 40వేల571 మందికి ఇళ్లు ఇవ్వలేదు..ఇప్పుడు బ్యాంకులు వచ్చి ఈఎంఐ చెల్లించాలని అడుగుతుండటంలో లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు..ఇలా గత ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఒక్క శాతం కూడా చేయకుండా లబ్దిదారులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది...టీడీపీ ప్రభుత్వంలో ఎంపిక చేసిన మూడు లక్షల 80వేల మంది లబ్దిదారులలో చాలామందిని తొలగించింది...ఇలా తొలగించిన లబ్దిదారులకు వారు చెల్లించిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ లబ్దిదారులు తిరుగుతున్న పరిస్థితి ఉందన్నారు మంత్రి.
మరోవైపు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 540 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.టిడ్కో ఒక్కో ఏరియాలో ఒక్కో కలర్ వేసాం.కానీ రంగులు మార్చడం కోసం 300 కోట్లు వృధా చేసిందన్నారు మంత్రి నారాయణ..అయితే టిడ్కో లబ్దిదారుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మౌళిక వసతులు కల్పన కు 5200 కోట్లు ఖర్చవుతుందన్న మంత్రి...త్వరలోనే పరిష్కరించేలా ముందుకెళ్తున్నామని స్పష్టం చేసారు.