ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవ‌స‌రం

Minister Mekapati Gowtham Reddy Review Meeting. ఐటీ శాఖ బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి

By Medi Samrat  Published on  13 Oct 2021 6:33 PM IST
ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ అవ‌స‌రం

ఐటీ శాఖ బ్రాండింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. క్రిస్‌మస్ కల్లా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల పైలట్ ప్రాజెక్టు పూర్తికి మంత్రి మేకపాటి ఆదేశించారు. ఈ మేర‌కు "వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల" ఏర్పాటులో పురోగతిపై మంత్రి మేకపాటి సమీక్ష నిర్వ‌హించారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న క్ర‌మంలో వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్లను ఏర్పాటు చేయబోయే ప్రాంతాలలో స్థానిక అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు మంత్రి మేకపాటి.

పైలట్ ప్రాజెక్టును 29 ప్రాంతాలలో ప్రారంభించే దిశగా ఐటీ శాఖ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 24 కల్లా స్పష్టమైన నివేదికతో పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల విషయంలో భారీ ఎంఎన్‌సీ కంపెనీల నుంచి ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకోవాలని దిశానిర్దేశం చేయ‌నున్నారు. త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఐటీ శాఖ మంత్రికి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టౌన్ల కాన్సెప్ట్ వివరిస్తానన్న మంత్రి మేకపాటి తెలిపారు. ఐటీకి ఏపీ చిరునామా అనేలా బ్రాండింగ్ కూడా అవసరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఐటీ బ్రాండింగ్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఐటీ అధికారులను ఆదేశించారు. సమాచార పౌరసంబంధాల శాఖ సమన్వయంతో అపీటా ప్రమోషన్ పై మరింత ఫోకస్ చేయాలని సూచించారు. పైలట్ ప్రాజెక్టులో కీలకమైన విద్యుత్, ఇంటర్నెట్ ఇబ్బందులను ఐటీ శాఖ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి మంత్రికి తెలిపారు.

కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎంబీపీఎస్ మరీ తక్కువ ఉందని ఐటీ ఉన్నతాధికారులు మంత్రికి తెలిపారు. ఐటీ బ్రాండింగ్ స్ట్రాటజీ ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్లకు మౌలిక వసతులలో భాగంగా విద్యుత్ అంతరాయం గురించి ప్రస్తావించారు. బొగ్గు సమస్య, విద్యుత్ ఇబ్బందిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంతో చర్చలు జరుపుతున్నారని.. విద్యుత్ అంతరాయం తాత్కాలిక సమస్య అని మంత్రి అన్నారు. బొగ్గు గనులలో నిక్షేపాల కొరత వల్ల ఆంధ్రప్రదేశ్ కు ఇబ్బంది లేకుండా ఇప్పటికే ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తుంద‌ని.. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉన్నా, చర్యలు చేపడతామ‌ని అన్నారు. 29 ప్రాంతాలలో అవసరమైన బ్యాండ్ విడ్త్ సదుపాయాన్ని సత్వరమే కల్పించాలని ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డిని మంత్రి ఆదేశించారు. నవంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్ట్ అమలుకు ఐటీ శాఖ సన్నద్ధం కావాల‌ని అన్నారు.


Next Story