మెటా వైస్ ప్రెసిడెంట్ & గ్లోబల్ పాలసీ హెడ్ కెల్విన్ మార్టిన్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... మెటా ప్రపంచ మౌలిక సదుపాయాల అవసరాలు, ఏపీ డిజిటల్ పర్యావరణ వ్యవస్థకు అనుగుణంగా విశాఖపట్నంలో స్కేలబుల్ డేటా-సెంటర్ సామర్థ్య అభివృద్ధికి చొరవచూపండని కోరారు.
ఇమ్మెన్సివ్ టెక్నాలజీస్, ఏఐ, నెక్ట్స్ జెన్ డిజిటల్ ఉత్పత్తుల్లో స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం చేయడంపై దృష్టి సారించిన రియాలిటీ ల్యాబ్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపించడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH)తో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. వాట్సాప్ ఆధారిత డిజిటల్ గవర్నెన్స్, పౌర సేవల కోసం నిర్మాణాత్మక వినియోగ కేసులను విస్తరించడం, ఫిర్యాదుల పరిష్కారం, అధికారిక రాష్ట్ర కమ్యూనికేషన్‌లపై సహకారాన్ని బలోపేతం చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కెల్విన్ మార్టిన్ చెప్పారు.