బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరు : మంత్రి కొట్టు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  9 Feb 2024 12:42 PM GMT
బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరు : మంత్రి కొట్టు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే! అయితే ఆయన పర్యటన అట్టర్ ప్లాప్ అని వైసిపీ నేతలు అంటున్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. తన అవసరం బీజేపీకి ఉన్నట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని, బీజేపీ పెద్దలు బతిమాలి చంద్రబాబును పిలిచినట్టు చెప్పుకొచ్చారన్నారు. బీజేపీని శాసించే పరిస్థితిలో చంద్రబాబు లేరని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ వెళ్లి వచ్చాక చంద్రబాబు మొహం వాడిపోయిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ కల్యాణ్‌ దిగజారిపోయారు అంటే కోపం తెచ్చుకునే జనసైకులు ఇప్పుడు ఏమంటారో వారి విజ్ఞతకే వదిలేయాలని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుంటే మనకి మిగిలేది ఏంటి అని కాపులు ఆలోచిస్తున్నారన్నారు. ఫైనాన్సియల్ బెనిఫిట్స్ కోసమే పవన్ చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కూడా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గుంటూరు సభకు వెళ్తుంటే రాహుల్ కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు, కోడిగుడ్లు విసిరించాడని, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లేయించాడని కేవీపీ గుర్తు చేశారు. పొత్తులతో ఎన్నికలకు వెళ్లిన పార్టీల్లో నితీష్ కుమార్ తర్వాత ఆ రికార్డ్ చంద్రబాబుకే దక్కుతుందంటూ అన్నారు. మోదీ కుటుంబ విషయాల గురించి ప్రస్తావించిన వ్యక్తి చంద్రబాబు. అందుకే చంద్రబాబుకు మోదీ కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. తాను కలవకుండా అమిత్ షా.. నడ్డా వద్దకు పంపించారన్నారు కేవీపీ.

Next Story