దేవుడితో పరాచకాలు ఆడితే ఇంకా పాతాళానికి పోతావ్ : మంత్రి కొట్టు

Minister Kottu Satyanarayana Fire On Chandrababu. చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు.

By Medi Samrat  Published on  10 Jun 2023 3:45 PM IST
దేవుడితో పరాచకాలు ఆడితే ఇంకా పాతాళానికి పోతావ్ : మంత్రి కొట్టు

చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ పూజలు, యజ్ఞాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. దార్మిక పరిషత్, ఆగమ సలహా మండలి సూచనలతోనే యజ్ఞాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. బాబూ.. దేవుడితో పరాచకాలు ఆడితే ఇంకా పాతాళానికి పోతావ్ అంటూ హెచ్చరించారు. మోసం, దగా, వెన్నుపోటు, అవినీతి కలిపితే అదే చంద్రబాబు అని విమ‌ర్శించారు. నైతిక విలువల్లేని ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబని మండిప‌డ్డారు.

అధికారం కోసం బాబు అబద్ధాలు, అడ్డదారులు తొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. బాబు 14 ఏళ్లు సీఎంగా చేసి ఏపీని పాతాళానికి తొక్కేశాడ‌ని అన్నారు. 2019లో ప్రజలు ఛీ కొట్టినా మళ్లీ మాయమాటలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు. చంద్రబాబు లాంటి నీచుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం అంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు.. అవినీతి అనకొండ చంద్రబాబు అంటూ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

బాబు రెండెకరాలు నుంచి రూ.లక్షల కోట్లకు ఎలా పడగలెత్తాడని ప్ర‌శ్నించారు. చంద్రబాబు పాలనలో అంతా దుర్భిక్షం, కరువు కాటకాలేన‌ని.. 2024లో కూడా బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు.


Next Story