దసరా ఉత్సవాలకు రండి.. సీఎంకు ఆహ్వానం

Minister Kottu Satyanaraya Meets With CM Jagan. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని

By Medi Samrat  Published on  16 Sept 2022 2:37 PM IST
దసరా ఉత్సవాలకు రండి.. సీఎంకు ఆహ్వానం

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను ఉపముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కలిశారు. శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా ఉత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్‌ను దేవాదాయశాఖ మంత్రి, దేవాదాయశాఖ కమిషనర్, శ్రీశైలం దేవస్ధానం కార్యనిర్వహణాధికారి ఆహ్వానించారు.

మంత్రి కొట్టు సత్యనారాయణ వెంట ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వేదపండితులు ముఖ్యమంత్రి జ‌గ‌న్‌కి వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


Next Story