ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే : మంత్రి కొల్లు రవీంద్ర

గత ఏడాది ఇదే సెప్టెంబర్ 9 సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని.. కానీ ప్రజలు పట్టిన బ్రహ్మరథంతో నేడు వారి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు

By Medi Samrat  Published on  9 Sep 2024 10:18 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే : మంత్రి కొల్లు రవీంద్ర

గత ఏడాది ఇదే సెప్టెంబర్ 9 సమయానికి చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారని.. కానీ ప్రజలు పట్టిన బ్రహ్మరథంతో నేడు వారి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడేన‌న్నారు. సోమవారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ. పండగ రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. 9 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు.. బ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందన్నారు. విజయవాడ కలెక్టరేట్లోనే ఉండి సీఎం సహాయక చర్యలు చేపడుతుంటే విమర్శలు చేస్తున్నారని వైసీపీపై మండిప‌డ్డారు. ప్రజల కోసం సీఎం ప్రతి నిమిషం కష్టపడుతున్నారని అన్నారు. ముంపు ప్రాంతాల్లో తాగునీరు, ఆహారం, పాలు, మెడిసిన్స్ తదితర నిత్యావసరాలు సరఫరా జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవడం కోసం ఇక్కడకు వచ్చారని విమర్శిస్తున్నారు.. విజయవాడలో ప్రస్తుత పరిస్థితులకు గత ప్రభుత్వమే కారణం అన్నారు. బ్యారేజీని కూడా డ్యామేజీ చేయాలని చూశారని.. దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలే ప్రసక్తి లేదన్నారు.

Next Story