19 రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు : మాజీమంత్రి కొల్లు రవీంద్ర

ప్రభుత్వ అధికారులు వైసీపీ రాజకీయ తొత్తులుగా మారారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరోపించారు.

By Medi Samrat  Published on  27 Sept 2023 6:49 PM IST
19 రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు : మాజీమంత్రి కొల్లు రవీంద్ర

ప్రభుత్వ అధికారులు వైసీపీ రాజకీయ తొత్తులుగా మారారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర అరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గేర్ మారుస్తా అన్న జగన్ రెడ్డి గేర్ బాక్స్ ఏ లేనప్పుడు గేర్ ఎలా మారుస్తాడోన‌ని ఎద్దేవా చేశారు. సీఐడీ చీఫ్ గా ఉన్న వ్యక్తిని ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ జగన్ రెడ్డి.. నేటికీ 19 రోజులైనా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని అన్నారు.

దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు నాయకులు, కార్యకర్తలు మాత్రమే రోడ్లు ఎక్కారు. కానీ మొట్టమొదటిసారి చంద్రబాబు అరెస్టు అయినప్పుడు సామాన్య ప్రజలు, మహిళలు రోడ్లు పైకి వచ్చి అన్యాయాన్ని ఎదిరిస్తున్నారని.. అక్కడే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గొప్ప‌త‌నం ఏంటో.. దట్ ఇజ్ చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక వల్లకాడు చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడ‌ని విమ‌ర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో కులాలు కోసం, మతాలు కోసం మాట్లాడిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

Next Story